![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 07:08 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు అని అన్నారు.నెలలో 20 రోజులు విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని అని ప్రశ్నించారు. కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు అని, రాజకీయ ఒడిదుడుకులు ఆయనకేం తెలుసు? అని మండిపడ్డారు. తాము ఎన్నో వ్యవప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యాం అని చెప్పారు. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి విమర్శించారుగాంధీ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘కేటీఆర్ ఈ మధ్య తెలంగాణలో ఉండటం లేదు. నెలకోసారి విదేశాలకు వెళుతున్నాడు. నెలలో పది రోజులు ఇక్కడ, 20 రోజులు విదేశాల్లో ఉంటాడు. కాబట్టి సీఎం రేవంత్ రెడీ షెడ్యూల్ ఆయనకు తెలియదు. విదేశాల్లో తిరిగే కేటీఆర్‌కి సీఎం రేవంత్ ఏం చేస్తున్నది ఎందుకు తెలుస్తుంది. పదేళ్లు మంత్రిగా నువ్వు, సీఎంగా మీ నాయన చేశాడు. ఢిల్లీకి ఎందుకు పోతారో ఆ మాత్రం తెలియదా? కేటీఆర్. ఎరువులు, నిధులు, నీళ్ల పంచాయతీ కోసం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి లిక్కర్ దందా కోసం పోయింది. హరీష్ రావు, కేటీఆర్‌లు ఈడీ ఆఫీస్ల కోసం డిల్లీ వెళ్ళారు. మా సీఎం కేంద్రం చుట్టు తిరుగుతున్నారు. కేటీఆర్‌కి సిస్టర్ స్ట్రోక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు డిల్లీ. మీ లాగా మాది గల్లి పార్టీ కాదు కదా?. కేటీఆర్.. నీ స్ట్రోక్‌ల లొల్లి మాకెందుకు రుద్దుతున్నావు’ అని అడిగారు.
‘కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు. రాజకీయ ఒడిదుడుకులు నీకేం తెలుసు?. సన్నాసులు అనే మాటలు స్టార్ట్ చేసింది మీ అయ్యనే. మీరు తిట్టిన మాటలను కాస్త పాలిష్ చేసి తిడుతున్నారు. మేము సత్రం నడపడం లేదు, మీరు తిడితే మేము తిడతం. సీఎం రేవంత్ రెడ్డిని గోకుడు ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు?. తిట్ల పురాణం మీదే.. మీరు ఒకటి అంటే మేం పది తిడుతున్నాం. కేటీఆర్ అమెరికాలో చదివి.. పదేళ్లు మంత్రిగా చేసాడు. చర్చ అసెంబ్లీలో చేయాలా?, కల్లు కాంపౌండ్‌లోనా?. కళ్లు కాంపౌండ్‌కు రా అంటే ఎట్లా?. వెయ్యి కోట్లు పక్క రాష్ట్రాల ఎన్నికల్లో పంపింది కేసీఆర్ కుటుంబం. కేటీఆర్ అబద్దాల కోరు. అందరికీ వడదెబ్బ తగిలితే.. ఆయనకు ఫ్యామిలీ దెబ్బలు తగులుతున్నాయి. కేటీఆర్‌కి అవగాహనలేక ఇబ్బందిపడుతున్నారు. కేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు. నెలలో 20 రోజుల్లో విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.