![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:38 PM
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో తరచూ వంతెనలు కూలుతున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనపై స్పందించారు. ‘డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ. మోర్బీ వంతెన కూలి 140 మందికిపైగా మరణించిన తర్వాత ఇది మరో షాక్. ఎన్డీఎస్‌ఏ లేదా వేరే సంస్థలు విచారణ చేస్తాయని భావిస్తున్నా' అని Xలో పోస్ట్ చేశారు.