|
|
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:44 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఒక కోటి 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . భారతి నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.హాజరైన స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, సీనియర్ నాయకులు పరమేష్, ఐలేష్, పృథ్వీరాజ్, ఆయా కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.