![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:36 PM
తెలంగాణ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి.. సకాలంలో యూరియా సరఫరా చేయాలని ఆయనను కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తి మేరకు రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు నడ్డా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచనలు చేశారు.