![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 04:42 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య నలుగురికి చేరింది. తాజాగా స్వరూప (56) అనే మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో ఇప్పటికే తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌లోని సాయిచరణ్ కాలనీకి చెందినవారు. కల్తీ కల్లు తాగిన కొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ కల్లు సరఫరా చేసిన కల్లు డిపోల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 674 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రస్తుతం పరారీలో ఉన్న కల్లు కాంపౌండ్ నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కల్తీ కల్లు తయారీ, సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిఘాను అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.