![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 02:55 PM
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ భద్రకాళీ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు వేద మంత్రోచ్చారణతో వైదికులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి జూలై 10 వరకు 15 రోజుల పాటు కనులపండువగా అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటి రోజు భద్రకాళీ అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, నిత్య యాగంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆషాఢ పౌర్ణమి రోజు జూలై 10న శాకంబరీ అలంకరణలో భద్రకాళీ భక్తులకు దర్శనమివ్వనున్నారు.