![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 02:36 PM
రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. వీటిని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈనెల 14న విచారణకు రావాలని ప్రభాకర్‌రావును సిట్ ఆదేశించింది.