|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 03:14 PM
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు పేర్కొన్నారు. శుక్రవారం అత్తాపూర్ సర్కిల్, కాటేదాన్ సెక్షన్ (మైలార్‌దేవ్‌పల్లి వార్డ్-117) పరిధిలోని దుర్గా వెంచర్ ప్రాంతంలో కొత్త మంచినీటి పైప్‌లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఆధ్వర్యంలో రూ. 184.00 లక్షల (ఒక కోటి 84 లక్షలు) అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. అయ్యప్ప టెంపుల్ సమీపంలోని వివిధ గృహ సముదాయాలకు ప్రయోజనం చేకూర్చేలా 200MM, 150MM మరియు 100MM డయా కలిగిన వాటర్ సప్లై లైన్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీటిని అందించడమే మా లక్ష్యం. ఈ పైప్‌లైన్ పనులు పూర్తయితే కాటేదాన్ మరియు మైలార్‌దేవ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి శాశ్వతంగా తొలగిపోతుంది. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడమైనది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు