|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 12:02 PM
శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని డంపింగ్ యార్డ్ ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు. డంపింగ్ యార్డ్ లోని చెత్త రీసైక్లింగ్ మిషినరిని పరిశీలించి, పరికరాల పని విధానం, నిర్వహణ ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతి త్వరలోనే మిర్యాలగూడ డంపింగ్ యార్డ్ లోని చెత్తను రీసైకిల్ చేసి తొలగించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.