|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 11:33 AM
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 14 తేదీలలో జరగనున్న మహనీయుల జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మహనీయుల ఆలోచనా విధానాన్ని కొనసాగించాలని, జయంతి కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.