|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 12:29 PM
పటాన్చెరు : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. యువజన వికాస సమితి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువజన సంఘాలు సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టుబుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, యువజన వికాస సమితి అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.