|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:16 PM
హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. నగరంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ వెలుపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపనుంది. పర్యావరణరహిత రవాణా లక్ష్యంగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది. కాలం చెల్లిన డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించి, ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.