|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:25 PM
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 54,50,000 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రహరీ గోడకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గురువారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.