|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 04:09 PM
తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను బీఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్యమకారులు తెలంగాణ భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను తరలించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.