|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 11:02 AM
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ నాయకులు కోల శ్రీకాంత్ ముదిరాజ్, బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిహెచ్ఎంసి లోని అన్ని డివిజన్ల లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు మాట్లాడుతూ.... గ్రంధాలయాలు మనోవిజ్ఞాన పెంపుదలకు నిలయాలు అని, గ్రంథాలయాలలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించినట్లయితే విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక స్టైర్యం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ శేకర్, విక్రమ్ రెడ్డి, కేశవ్ యాదవ్, యోగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.