|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 10:54 AM
పటాన్చెరు పట్టణం జెపి కాలనీ GHMC డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన. రాజన్న టీ కొట్ట ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు ఘనంగా ప్రారంభించారు.న్యూ మార్కెట్ రోడ్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పృథ్వీరాజ్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... షాప్ యజమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.రాజన్న టీ కొట్టు ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో అనేక ఫ్రాంచైజీలతో విజయవంతంగా కొనసాగుతున్న బ్రాండ్ అని తెలిపారు.ఈ సందర్భంగా రాజన్న టీ కొట్టు చైర్మన్ రాజు గారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో తీగలనగరం శంకర్ గారు, మల్లేష్ గారు, మూర్తి గారు, MPR యువసేన సభ్యులు, హోటల్ యాజమాన్యం మరియు ఇతరులు పాల్గొన్నారు.