|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 12:01 PM
ప్రముఖ తెలుగు పరిశోధకుడు, బహుభాషావేత్త డాక్టర్ మలయశ్రీ (86) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి బ్రెయిన్ డెడ్ కావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. మలయశ్రీ కవి, కథకుడు, నవలాకారుడు, చరిత్రకారుడిగా విశేష కృషి చేశారు. కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రపై లోతైన పరిశోధనలు చేసి, 150కి పైగా గ్రంథాలు రచించారు. ఆయన రచనలు నేటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ‘బాల సాహిత్యం’ ద్వారా చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచారు.