|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 11:44 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం, 2024 సంవత్సరంలో పీఎం-ఉషా నిధుల ద్వారా కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2026 నాటికి ఈ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.కూకట్పల్లి ఇంటర్మీడియట్ కాలేజీ పాటు ఈ ప్రాంగణంలో, ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా అందుబాటులోకి రావడం స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేంద్ర రెడ్డి గారు,ఇంచార్జ్ బండి రమేష్ గారు పాల్గొని ,ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంచార్జ్ బండి రమేష్ గారు ఈ డిగ్రీ కాలేజీ ప్రాజెక్ట్‌ను కూకట్పల్లి ఉన్నత విద్య అభివృద్ధిలో కీలక భాగంగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు ,గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కాలేజీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే కాకుండా, టెక్నాలజీ వైపు కూడా ప్రోత్సాహం అందుతోంది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ల్యాప్టాప్‌లు పంపిణీ చేయడం జరిగింది. కాలేజీ ప్రిన్సిపాల్ పేర్కొన్న విధంగా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఆధునిక విద్యా విధానాలు అమలు చేయబడుతున్నాయి.కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం ఈ అభివృద్ధిని విద్యార్థుల భవిష్యత్తుకు గొప్ప అవకాశంగా భావిస్తోంది. భవిష్యత్తులో కూడా విద్యా రంగంలో కూకట్పల్లి ముందంజలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.