|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 11:28 AM
సంగారెడ్డి జిల్లా గొల్లగూడెం గ్రామంలో శ్రీ బ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ఎల్లమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దలు, కుర్మ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ దేవతల ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.