|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 11:20 AM
TG: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో 21 ఏళ్ల యువతి గంజాయి ముఠా చేతిలో దారుణ హత్యకు గురైంది. బుధవారం రాత్రి యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఉరివేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని, కాల్ డేటా, ఆధారాలు సేకరిస్తున్నామని తెలపడంతో ఆందోళన విరమించారు.