|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 11:47 AM
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉమ్మడి సూరారం డివిజన్ పరిధిలోని శివాలయ నగర్‌లో సలీం గారు మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి సందల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ గారు మాట్లాడుతూ, కులమత భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. హిందూ–ముస్లిం సోదరభావానికి ఈ కార్యక్రమం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు పరస్పర గౌరవాన్ని పెంపొందించడంతో పాటు యువతలో మంచి విలువలను పెంచుతుందని తెలియజేశారు.అదేవిధంగా, సమాజంలో శాంతి, ఐక్యతలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమీర్, అను, BRS పార్టీ నాయకులు కోల శ్రీకాంత్ గారు, ముకుందరావు గారు, రవికుమార్ గారు, వర ప్రసాద్ గారు,బద్దం కిరణ్ గారు, డేవిడ్ గారు, వికాస్ గారు, రాకేష్ గారు, శివ గారు, శేఖర్ గారు, చరణ్ గారు తదితర నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.