|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 01:56 PM
ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 11 నుంచి 13 తేదీల మధ్య విడుదల చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు తెలుస్తోంది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా వారి ఆన్సర్ షీట్లను మరోసారి పరిశీలిస్తున్నారు. ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న సోషల్ మీడియాలో ప్రచారాన్ని బోర్డు ఇప్పటికే ఖండించింది. మరో రెండు రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.