|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 01:55 PM
TG: మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు బండి సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం తాగి వాహనం నడిపినంత మాత్రాన వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. డ్రైవర్ మత్తులో ఉన్నట్లయితే, అతని బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. ఎవరూ అందుబాటులో లేని పరిస్థితిలో మాత్రమే జాగ్రత్తలతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించవచ్చని పేర్కొంది. ఈ మేరకు పోలీసులు చట్టబద్ధ విధానాలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది.