|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 12:46 PM
TG: అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ప్రతులు అందజేసి, గృహ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వంలో గూడు లేని వారికి ఇళ్లు నిర్మించి అండగా నిలుస్తామని తెలిపారు.