|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 03:59 PM
ఏప్రిల్ నెల ఆరంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయబడింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, చిత్తూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.