|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 11:34 AM
నేడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మహాత్మ జ్యోతిరావు పూలే గారి సేవలను స్మరించుకుని, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానంద్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, రుద్రారం శంకర్ గారు, బలవంత రెడ్డి గారు, శ్రీరాములు గారు, విజయ్ గారు, సత్యనారాయణ గారు, రవీంద్ర చారి గారు, కిష్టయ్య గారు, కార్ రాజు గారు, కళ్యాణ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.