|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 10:35 AM
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో 36 మంది ప్రయాణికుల్లో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.