|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 12:05 PM
మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో ని జ్యోతిరావు పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే గారి సేవలు దేశానికి అమూల్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఆయన చూపిన మార్గం సామాజిక న్యాయం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.పూలే గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.