|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 01:36 PM
సైనిక్ పురిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో పాల్గొన ఈటల రాజేందర్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ దేశం గర్వించే ముద్దుబిడ్డ, ఈ దేశానికే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే.పూలే గారి 199వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం, ఆయన ఆశయాలను మరోసారి నేమరువేసుకొని, ఆయన త్యాగాలకు స్ఫూర్తి పొంది ఈ తరం మాత్రమే కాదు రాబోయే తరాలు కూడా త్యాగమంటే, ప్రజాహితం కోసం పనిచేయడం అంటే ఏంటో ఆయన జీవితమే ఒక ఆదర్శం.పూలే గారి అడుగుజాడల్లో నడిచిన వారి సతీమణి సావిత్రిబా పూలే గారు మొట్టమొదటగా దేశంలో మహిళలకు చదువు ఉంటేనే సమాజం బాగుపడుతుంది అని నమ్మి... ఆనాటి ఉన్మాదానికి వ్యతిరేకంగా, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆడపిల్లలకు చదువు చెప్పిన మొట్టమొదటి గురువు సావిత్రిబాయి పూలే.మిలటరీ, స్పేస్, అడ్మినిస్ట్రేషన్, అన్ని రంగాలతో పాటు రాబోతున్న 33% రిజర్వేషన్లలో కూడా సావిత్రిబాపూలే వేసిన పునాది భారతదేశంలోని మహిళ లోకానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. రేపు అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా ఈ దేశహితం కోసం జరిగే చట్ట నిర్మాణంలో కూడా మహిళలకు 33% నరేంద్ర మోడీ Narendra Modi గారు చేయాలనుకున్న సంకల్పం దానికి పునాది వేసిన మహానాయకురాలు సావిత్రిబాపూలే.200 ఏళ్ల క్రితం పుట్టిన వీరు భారతదేశానికి వెలుగు, స్ఫూర్తినిచ్చే మహనీయులు కాబట్టి ఆ మహా పురుషులు ఎన్నటికీ మరణించరు... వాళ్ళ ఆశయాలు సజీవంగానే ఉంటాయి. వాళ్ల స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకొని ముందుకి కదలాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే గార్లకు ఘనమైన నివాళులర్పిస్తున్నాను
ఈ కార్యక్రమంలో నేరెడ్మేట్ మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి గారు, మాల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ గారు, వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు, మౌలాలి మాజీ కార్పొరేటర్ సునీత యాదవ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి గారు, గోపు రమణ రెడ్డి గారు, సీనియర్ నాయకులు వి కే మహేష్ గారు, మౌలాలి డివిజన్ అధ్యక్షులు శివ గారు, బుల్లెట్ స్వప్న గారు, గణేష్ గారు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.