|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 01:40 PM
ఇస్కాన్ సైబరాబాద్ ట్రస్ట్ పేదల ఆకలి తీర్చడమే వీరి ధ్యేయమనీ గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు.గోపనపల్లి లోని రంగనాథ స్వామి ఆలయం పక్కన గల ఇస్కాన్ సైబరాబాద్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన నిత్య బ్రేక్ ఫాస్ట్ సేవ ను ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే ఈ ట్రస్ట్ ప్రధాన ధ్యేయమని తెలిపారు.అనేక ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణీ స్త్రీలు,చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ప్రతిరోజు ఉదయం 09.00 గంటల నుండి 10.30 గంటల వరకు నిర్వహించబడే ఈ ఉచిత బ్రేక్ ఫాస్ట్ సేవ ద్వారా భక్తులు,స్థానిక ప్రజలు మరియు అవసరమైన వారికి పోషకాహారం అందించబడుతుంది అన్ని తెలిపారు.భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించి ఎక్కువ మందికి చేరవేసేలా చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.ఈ ఉచిత బ్రేక్ ఫాస్ట్ వల్ల అనేకమంది ఆకలి బాధలుతీరుతాయని, అందుకు వీరిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకుని ట్రస్ట్ కార్యకలాపాలకు సహకరించాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు భక్తులు, పాల్గొన్నారు.