|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 01:44 PM
ఈరోజు 128 - చింతల్ డివిజన్ హెచ్ఎంటీ గ్రౌండ్స్ లో "ఐ కార్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్" ఆధ్వర్యంలో నూతన ప్రవేశపెట్టిన ఈవీ వాహనాల చేర్పు కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా హాజరై వాహనాలకు జెండాను ఊపి సేవలను అధికారికంగా ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 15 సంవత్సరాల సుధీర్ఘ అనుభవంతో 100 కు పైగా కంపెనీల క్లయింట్లకు సేవలను మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కంపెనీలు, ఉద్యోగులకు పాటు సురక్షితమైన, సమయపాలనతో కూడిన మంచి సర్వీసులను అందిస్తున్న "ఐ కార్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్" ఈవీలను ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు వారాల వినోద్, రాజ్ కుమార్, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.