|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 01:56 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో జిల్లా మహిళా ఎగ్జిక్యూటివ్ కమిటీ రివ్యూ మీటింగ్ ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కావ్యశ్రీ గారు, అలాగే సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జి రజిత గారు హాజరై ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపారు.సమావేశంలో మహిళా కాంగ్రెస్ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల విస్తరణ, రాబోయే కార్యక్రమాల ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. మహిళా నాయకులు ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.