బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:05 PM
కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో శ్రీ మహాత్మా బసవేశ్వర మహరాజ్ 893 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.