అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 10:22 AM
TG: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి యాద్గార్‌పల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గబ్బిలాల్‌పేట్ ప్రాంతానికి చెందిన కాకరాజు, అరుణ్‌గా గుర్తించారు. వీరు జవహర్‌నగర్‌లో వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.