|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 03:29 PM
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో 199వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మహాత్మా జ్యోతి రావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించారని, అంటరానితనం, కుల వివక్షత వ్యతిరేకంగా, మహిళల అభ్యున్నతికి కృషి చేశారని వారు తెలిపారు.