|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 02:37 PM
అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం రాజకీయ వేడిని పెంచింది. ఎంపీ డీకే అరుణ, మంత్రి వాకిటి శ్రీహరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మక్తల్ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని డీకే అరుణ సవాలు విసరగా, మంత్రి వాకిటి శ్రీహరి దానికి స్పందిస్తూ తాను సిద్ధమని తెలిపారు. డీకే అరుణ రౌడీయిజం గురించి పాలమూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతో తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.