|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 10:38 AM
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో పత్తి ధర తగ్గినా నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ధర లోటు చెల్లింపు పథకం (PDPS) అమలు చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే, ఆ తేడా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ధరల తగ్గుదల వల్ల రైతులకు నష్టం ఉండదు.