|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 02:57 PM
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఏప్రిల్ 19 : శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్‌లోని జవహర్ నగర్ శ్రీ శ్రీ శ్రీ లలిత పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. సిద్ధార్థ హాస్పిటల్ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, కోఆర్డినేటర్ రఘునాధన్ రెడ్డి పాల్గొన్నారు.