|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 04:12 PM
మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని, జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని అన్నారు. జీవన్ రెడ్డిని హరీశ్ రావు ఎప్పుడూ పార్టీలోకి ఆహ్వానించలేదని, కేటీఆర్ బ్రతిమిలాడి తీసుకువెళ్లారని తెలిపారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారని, బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని, హరీశ్ రావు ఢిల్లీలో ఎవరిని కలిశారనేది త్వరలో బయటపడుతుందని అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువని, ఆయన కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు.