అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 11:16 AM
TG: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నీ అనుకూలిస్తే మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది.