|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 02:36 PM
గుంటూరు పల్లిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందని రైతులెవరు నష్టపోవద్దని సంకల్పంతో కొనుగోలు చేపడుతోందని అన్నారు. రైస్ మిల్లులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. వరి పండించిన రైతులెవరు అధైర్య పడవద్దని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కటింగ్ పేరుతో నిలుపు దోపిడి చేశారని 15 కిలోల నుండి 20 కిలోల వరకు కట్ చేసిన సందర్భాలు ఉన్నాయని అలాంటివి ఏవి లేకుండా నేడు ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా కొనుగోలు చేశామని తెలిపారు. రైతులు ఎవరు ఆధైర్యపడవద్దని రైతులకు వడగళ్ల వానలు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని సంచులు కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి దాన్యపు గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.