|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 04:43 PM
ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో ముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని, వారి కృషిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తలసాని అన్నారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి కార్మికులకు ఉందని ఆయన పేర్కొన్నారు.ఆర్టీసీ ఎంతో ప్రాధాన్యం కలిగిన సంస్థ అని పేర్కొన్న తలసాని.. గత 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వెనక ప్రతిపక్ష నేతలు ఉండి సమ్మె చేయిస్తున్నారని ఒక మంత్రి ఆరోపణలు చేస్తున్నారని తెలిపిన తలసాని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం తీరిస్తే అసలు కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. సమ్మె చేసే కార్మికులను ఆర్టీసీ ఎండీ బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి వెళ్లి సచివాలయాన్ని ముట్టడిస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి వారికి ఇచ్చిన హామీలను సాధిద్దామని తలసాని పిలుపునిచ్చారు.