|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 02:27 PM
హైదరాబాద్ మహా నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్ల తో నీటిని తోడుతున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు జలమండలి అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లు సీజ్ చేసారు. బుధవారం రోజున సికింద్రాబాద్ జోన్ ఓ అండ్ ఎం డివిజన్ 17 పరిధిలోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జామున 4 గంటల సమయంలో పర్యటించి నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 17 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.