![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 11:00 AM
రూ.1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈఈ. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో చేర్చేందుకు రూ.1,20,000 లంచం డిమాండ్ చేసిన ఏఈఈ బి.స్వరూప . బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ఏఈఈ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్, తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఏఈ స్వరూపను పలుమార్లు ఆశ్రయించారు. అయితే.. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి బదులుగా.. ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచంగా ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేసింది. తన నిజాయితీకి, చట్టబద్ధతకు కట్టుబడి ఉన్న కాంట్రాక్టర్.. చేసేదేమీ లేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ యూనిట్ అధికారులు కాంట్రాక్టర్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని.. పకడ్బందీ ప్రణాళికను రచించారు