![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 08:53 PM
హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాను ఈగల్ టీం గుర్తించింది. రెస్టారెంట్ యజమాని సూర్య.. ప్రముఖ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొన్నాడు. మరో 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సప్లై చేయగా, వారందరిపై కేసులు నమోదు చేశారు.