![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 12:43 PM
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెరదించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. "జిల్లాకు ఎమ్మెల్యేనే రాజు. ఆ రాజుకు మంత్రులుగా మా సహాయం అవసరమైతే తప్పకుండా చేసి పెడతాం" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలలో గ్రూపులు, గొడవలు చాలా సాధారణమని, రాష్ట్రంలోని ప్రతి పార్టీలోనూ ఇలాంటివి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో, "బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత మధ్య గొడవలు లేవా?" అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని వివేక్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను మీనాక్షి నటరాజన్ గుర్తిస్తున్నారని, అందరికీ తగిన అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు.