![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 02:15 PM
చింతపల్లి మండల కేంద్ర సమీపంలోని సాయి సన్నిధిలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి నాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ధనుంజయ అన్ని ఏర్పాట్లు చేశారు.