![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 09:00 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ నేత మాధవీ లత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో తనపై సెటైర్లు వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీని రాజాసింగ్ ఎందుకు వీడి వెళ్లిపోయారో ఆయనకే తెలియదన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే.. పార్టీలో మగాళ్లు లేరా అని రాజాసింగ్ అప్పట్లో ప్రశ్నించారని, అయినా కూడా ఆయన తన తమ్ముడేనని చెప్పారు.
భయపడుతుందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు ఇచ్చే డబ్బు మూటలతో ఈ ప్రభుత్వం నోరు కట్టేసుకుందంటూ ఆరోపించారు. తన పార్లమెంట్ పరిధిలోని వేలాది మంది ప్రజలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టమని, తనకు అవకాశం ఇస్తే బరిలో ఉంటానని మాధవీ లత స్పష్టం చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవ అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో.. ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఎదురుచూస్తోంది. మాధవీలతను ఆ స్థానానికి ఎమ్మల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.