![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 12:31 PM
గుజరాత్‌లో మరో వంతెన కూలిన ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గొప్పగా చెప్పుకునే ‘గుజరాత్ మోడల్’, ‘డబుల్ ఇంజన్ సర్కార్’ పనితీరు ఇదేనా అంటూ ఘాటు విమర్శలు చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే వంతెనలు ఎందుకు కూలుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనతో బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ మరోసారి బయటపడిందని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ) లేదా ఇతర ఏజెన్సీలతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు.