![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:51 PM
BRS పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు. దగా క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతివ్వాలని నిరుద్యోగ యువత కోరారని.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు BRS అండగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని.. కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.